అంతరించిపోతున్న చేనేత కళను ఆదుకునేందుకు ఎన్డీఏ
కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చేనేత కార్మికులకు అండగా ఉంటుందని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్ర శేఖర్ రావు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెన్నూరులోని చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకొని వారిని శాలువాలతో సత్కరించి చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత వస్త్రాల పై GST తీసివేయాలని, వర్షాకాలంలో మగ్గం గుంతల్లోకి నీరు చేరి పనులు ఆగిపోతే 24 వేలు ఇచ్చే పథకాన్ని, అలాగే ఐసీఐసీఐ లాంబోర్డ్ హెల్త్ కార్డు పథకాలను కొనసాగించడంతో పాటు 200 యూనిట్లు లోపు ఉచిత కరెంట్ ను ప్రభుత్వం అందించాలని చేనేత కార్మికులు తమ సమస్యల్ని తెలియచేశారు. సమస్యలను ఎంఎల్ఏ పాశం సునీల్ కుమార్ దృష్టికి, సంభందిత అధికారుల దృష్టికి తీసుకెల్తామని,సిఎం చంద్రబాబు నాయుడు, మరియు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ లు తప్పకుండా చేనేత కార్మికులను ఆదుకుంటారని జనసేనా నాయకులు భరోసా ఇచ్చారు.పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించే క్రమంలో చేనేత కార్మికులకు పని కల్పించేలా చేనేత కళాకారుల దగ్గర వస్త్రాలను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు చేనేత సొసైటీ ప్రెసిడెంట్ కటికాల శ్రీనివాసులు,నేతన్నలు జిలగా బాలాజీ, మురళీ శ్రీనివాసులు, వెంకటేష్, జనసేన పార్టీ నాయకులు దామవరపు బాలసుబ్రమణ్యం, రౌతు శివకుమార్, గోను క్రాంతి కుమార్, కుందర్తి నాగార్జున, చెన్నుమాటీ అక్బర్ కుమార్,భాస్కర్, మనోజ కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.