గూడూరు :
తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ షరీనా, డాక్టర్ మైథిలి లు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో
మైథిలి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ అధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ జరిగింది. తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రినుండి గడియారం స్థంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఆసుపత్రి సూపరిడెంట్ డాక్టర్ షరీనా, మైథిలి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మైథిలి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమన్నారు. పుట్టిన బిడ్డకు గంట లోపు తల్లిపాలు పడితే ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో
మైథిలి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ Lv రమణబాబు,స్టాప్ నర్సు గౌరీ, సిస్టర్లు,మైథిలి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.