Advertisements

అధికారులకు కూడా తెలుపుతున్న పేద వారిని కార్యాలయంల చుట్టూ తిప్పుకోవద్దు.

గూడూరు పట్టణం:- నియోజకవర్గ పరిధిలోని అధికారులతో పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించిన….

డాక్టర్ పాశిం సునీల్ కుమార్
శాసన సభ్యులు

మాట్లాడుతూ…

ఇపుడు ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పటికి,MGNREGS లో ఉన్న నిధులను మండలాల అభివృద్ధి కోసం ఉపయోగించాలని అన్నారు.

గతంలో రైతులు గోకులాలు, మినీ షెడ్ లు నిర్మించుకున్నారు వాటి తాలుక బిల్లులు ఇప్పటికి మంజూరు చేయలేదు.

ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గత పెండింగ్ బిల్లు లను చెలించాలని సమావేశంలో తెలిపియున్నారు.

కావున అధికారులు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న మినీ గురుకులం తాలుక బిల్లు లను త్వరగా లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు.

నేను ఎలెక్షన్ ప్రచారంలో తిరిగినపుడు గ్రామాలలోని ST/SC/BC కాలనీలలో నివసించే వారు తనను కలసి రోడ్లు, నీటి వసతి కల్పించాలని కోరున్నారు.

అధికారులకు కూడా తెలియజేస్తున్నాను ఇపుడున్న నిధులు కూడా ST/SC/BC కాలనీల అభివృద్ధి కి ఉపయోగించండి అని అన్నారు

ఎలెక్షన్ లలో నాకు పెద్ద రెడ్లు ఎవరు చేయలేదు, నా ఈ గెలుపుకు కారణం SC /BC /ST మైనారిటీ, మధ్య తరగతి రెడ్లు కావున వాళ్ళ ఋణం తీర్చుకోలేనిది, వాళ్లకి ఎప్పటికి రుణపడి ఉంటాను.

అధికారులకు కూడా తెలుపుతున్న పేద వారిని కార్యాలయంల చుట్టూ తిప్పుకోవద్దు.

మండలం లో నాయకులు ఎలెక్షన్ ప్రచారంలో మనము గ్రామాలకు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చున్నామో మొదట వాటికి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే ప్రజలు మన మీద నమ్మకంతో మనకు ఓట్లు వేసి గెలిపించారు, గత ప్రభుత్వం లాగ మనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు.

అధికారులు కూడా మీ దృష్టికి గ్రామస్థులు తెచ్చినవి ఉంటే మాకు తెలిపితే వాటిని పరిగణలోకి తీసుకుని చేద్దాం అని అన్నారు.

ఎవరైనా ఇంకా YCP వారికి సహకరిస్తూ, మేము చెప్పినవి కాకుండా వేరే చేసే ఉద్దేశాలు ఉంటే వెంటనే మీరు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో లో మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, మద్దాలి సర్వతమ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, గణపర్తి కిషోర్ నాయుడు, సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, చిల్లకూరు దసరదరామిరెడ్డి,నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి,నాయకులు నెలబల్లి భాస్కర్ రెడ్డి,కోటేశ్వర రెడ్డి, మోహన్ రెడ్డి,బిల్లు చెంచురామయ్య,జలీల్ అహ్మద్,ఇశ్రాయేలు కుమార్, అబ్దుల్ రహీమ్, మల్లికార్జున్ రెడ్డి, దారా సురేష్,కోకొల్లు మధు యాదవ్ మహిళలు గుండాల లీలావతి, మట్టం శ్రావణి రెడ్డి, నెలటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This