Advertisements

భార్య బిడ్డల ను వేధిస్తున్న భర్త.

భార్య బిడ్డల ను వేధిస్తున్న భర్త. —-నాకు రక్షణ కల్పించండి అంటున్న భార్య. నా పేరు నెట్టెల ప్రేమలత మాది తిరుపతి జిల్లా ఎం ఆర్ పల్లి. నాకు పది సంవత్స క్రితం బి శంకర్ అనే వ్యక్తి తో వివాహం జరిగినది. అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కుప్పం లోని పాఠశాల నందు విధులు నిర్వహిస్తున్నారు. మాకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. మా కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతున్నది. ఆయనకు డ్రింక్ చేసి వస్తున్నారు నేను ఇది ఏమిటి అని అడగగా నన్ను అడిగే అంత దానివా నీవు అని నన్ను దుర్భాషలాడి నన్ను అనుమానించడం మొదలు పెట్టాడు. దీంతో ఆయన నన్ను నా బిడ్డలను హింసించడం మొదలుపెట్టాడు. నా కడుపు కోయించుకొని బిడ్డలకు జన్మనిచ్చాను. నా దగ్గర నుంచి నా బిడ్డను తీసుకెళ్ళి నన్ను చిత్రహింసలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. నా భర్త మీద తిరుపతి దిశ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. నన్ను రౌడీల ద్వారా మ్యాన్ హ్యాండిలింగ్ చేయించి నా బట్టలను కూడా చించేశారు ఇబ్బందులు పెడుతున్నందున నేను నెల్లూరు నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాను. అయినను తిరుపతి రూరల్ ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న జోగిరావు నన్ను నానా దుర్భాషలాడి నామీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మా తల్లిని కూడా మేడ్ హ్యాండిలింగ్ చేశారు అని ప్రేమలత తెలిపింది. నా బిడ్డలను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుర్గా మిట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సహాయంతో నేను సురక్షితంగా బయటపడ్డాను. నాకు నా బిడ్డలకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ విషయం ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె తెలిపింది.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This