మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన అల్లూరు సుమన్ తేజ ను మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా మంగళవారం ఎన్నుకొన్నారు. గుంటూరు లోని మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో టిడిపిలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఉత్సాహంగా పనిచేసిన సుమన్ తేజాను గుర్తించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు మాల మహానాడు రాష్ట్ర ప్రెసిడెంట్ అన్నవరపు కిషోర్ ప్రకటించారు. సుమన్ తేజకు పదవి రావడంతో పార్టీ నాయకులు గ్రామ ప్రజలు మండల ప్రజలు సంబరాలు చేసుకున్నారు సుమన్ తేజ ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సుమన్ తేజ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దళితులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలిచి పోరాడుతున్నానన్నారు.