మండల పరిధిలోని చెన్నూరు బాలికోన్నత పాఠశాల విద్యార్థిని మందా అనూష స్పోర్ట్స్ కోటాలో ట్రిపుల్ ఐటీలో సీటు కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని మముల్లాజాన్ తెలిపారు . అనూష ఇప్పటికే అండర్ -17 హ్యాండ్ బాల్, జూనియర్ హ్యాండ్ బాల్ , సబ్ జూనియర్ హ్యాండ్ బాల్, సి ఎం కప్ పోటీల్లో పాల్గొని విజేత గా నిలిచినట్లు తెలిపారు.ఆ అమ్మాయి విజేత గా నిలిచేందుకు శిక్షణ ఇచ్చిన వ్యాయమ ఉపాధ్యాయురాలు పి.కల్ఫన కుమారి తో పాటు విద్యార్థి ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.