ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.100% అకడమిక్ ప్రతిభ ఆధారంగానే ఈ ఎంపిక చేయాలన్నారు. అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని ఆయన సూచించారు. కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లలో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని, పాఠశాల విద్యలో ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు చేపట్టమని, గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయుల కు సత్కారం కూడా చేయమని విద్యాశాఖ ఉన్నత అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు.