గూడూరు మున్సిపల్ సంబంధిత గ్రామమైన చిల్లకూరులోని అన్నీ కాలనీల్లో బుధవారం ఉదయం మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి టిడిపి నాయకులు,పెంచలకోన ఆలయ ట్రస్ట్ బోర్డ్ మాజీ అధ్యక్షులు తానంకి నానాజీ తిరిగారు. కాలనీలో నెలకొని ఉన్న త్రాగునీరు,డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు ప్రధానమైన సమస్యలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులకు తెలియజేశారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు తానంకి నానాజీ మాట్లాడుతూ… అభివృద్ధి టిడిపి తోనే సాధ్యమని నమ్మి ప్రజలు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో,ఊహించని విధంగా గెలిపించడం జరిగిందని, అటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, గ్రామాలను అభివృద్ధి పరిచే విషయంలో రాజీ పడమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి రామిరెడ్డి, రామచంద్రారెడ్డి,దాసరి రాము మున్సిపల్ మరియు సచివాలయ సిబ్బంది.గ్రామస్తులు ఉన్నారు.