Advertisements

గూడూరు పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు

అరుంధతీయపాలెంలో కార్డెన్ సెర్చ్ నిషేధిత హన్స్, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు

డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి

 

గూడూరు పట్టణంలోని అరుంధతీయవాడ, బనిగిసాహెబ్ పేట ప్రాంతాలలో డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలతోపాటు 60మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏ నేరాలకు ఎటువంటి శిక్షలు పడతాయని తెలుసుకుంటే నేరాలజోలికి వెళ్లరన్నారు. ఈ ప్రాంతంలో అనుమానం ఉన్న ఇళ్లన్నీ గాలించామన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమంగా విక్రయించినా, నిషేదిత వస్తువులు రవాణా చేసినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడిపినా, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడిపినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పాపారావు, రెండవ పట్టణ సీఐ రవి కిరణ్, రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This