జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పటిష్టంగా అమలు చేయాలి
*భ్రూణ హత్యలను నివారించండి :
శుక్రవారం స్థానిక RDO ఆఫీస్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా RDO కిరణ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పట్టిష్టంగా అమలు చేయాలని, వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
సమాజం లో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని ఆడపిల్లల పట్ల వివక్షత ఉండ కూడదు అని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంను కఠినంగా అమలు చేయడం ద్వారా భ్రూణ హత్యలను నివారించవచ్చని అని అన్నారు. జిల్లాలో ప్రతి నెల అన్ని స్కానింగ్ కేంద్రాలను డాక్టర్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్ సెంటర్ల వారి రిజిస్ట్రేషన్ తొలగించడం జరుగుతుందని అన్నారు. స్కానింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు ఇతర మోడీఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ మార్చాలన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు. ఈ చట్టమను అతిక్రమించిన వారికి రూ.50000 రూపాయలు జరీమాన తో బాటు 3 సంవత్సరాల కఠినమైన శిక్ష లు ఉంటాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం తెలిసినవారు 102,104 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చని తెలిపారు. కావున ప్రజలలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం పై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మస్తనమ్మ గారు , డివిజనల్ పరిపాలన అధికారి శిరీష గారు, డెమో బాబు నెహ్రు రెడ్డి గారు, డిప్యూటీ సివిల్ సర్జన్ సంపూర్ణ గారు , సివిల్ అసిస్టెంట్ సర్జన్ బి.గిరిజ గారు, CDPO SK .మహబూబి గారు , గూడూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు.