ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు మధుసూదన్ యాదవ్.
పండుగలా పింఛన్లు పంపిణీ కార్యక్రమంఅంటున్న మధుసూదన్ యాదవ్.
తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జులై నెలలో 7000పింఛన్ ను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా చేస్తారన్నారు. పింఛన్ లు పంపిణీ చేసేటప్పుడు అవ్వ తాత ల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషం గా ఉందని, అలాగే అన్నీ రకాల సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం ఆనందం గా ఉందన్నారు. ఈరోజు పొద్దున్న ఆగస్టు నెలకి సంబందించిన 4000పింఛన్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ పింఛన్ ల పంపిణీ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వాసు, సుధాకర్, సచివాలయం కార్యదర్శి వేణుగోపాల్,సిబ్బంది పాల్గొన్నారు