???? ప్రభుత్వం జీఓ నెం :84ను అమలు చేయాలి
????గూడూరు డివిజన్ స్థాయిలో జర్నలిస్ట్ జేఏసీ బలోపేతం
???? జర్నలిస్ట్ జేఏసీ కన్వీనర్ బాబు మోహన్ దాస్,చైర్మన్ మీజూరు మల్లిఖార్జున రావు
????మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కార్యవర్గం ఏర్పాటు
????అధ్యక్షులు గా జగదీష్,ప్రధాన కార్యదర్శి గా జయకర్
???? నూతన కమిటీకి ఘన సత్కారం
గూడూరు డివిజన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ని డివిజన్ స్థాయి లో బలోపేతం చేసి జర్నలిస్ట్ లకు వేధింపుల నుంచి రక్షణ కల్పించేలా కృషి చేస్తామని జే ఏ సీ కన్వీనర్ గుంజాపల్లి బాబు మోహన్ దాస్ పేర్కొన్నారు.గురువారం మండల కేంద్రమైన మనుబోలు లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ల సమావేశం జరిగింది.జే ఏ సీ కన్వీనర్ బాబు మోహన్ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జే ఏ సీ చైర్మన్ మీజూరు మల్లిఖార్జున రావు,ప్రతినిధులు షేక్ జమాలుల్లా,ఉడతా శరత్ యాదవ్,శివ,సుబ్రహ్మణ్యం,నన్నూరు లక్ష్మణ్ లు ముఖ్య అతిధులు గా హాజరై ప్రసంగించారు.*
*ఈ సందర్బంగా మీజూరు మల్లిఖార్జున రావు మాట్లాడుతూ జర్నలిస్ట్ లను ఇబ్బందులకు గురి చేసే వారిపై న్యాయపరంగా లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.జర్నలిస్ట్ ల సంక్షేమం,హక్కుల సాధనే ధ్యేయంగా జే ఏ సీ పని చేస్తుందన్నారు. జామలుల్లా,శరత్ యాదవ్ లు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జర్నలిస్ట్ లపై దాడులు,వేధింపులను అరికట్టెందుకు అమలు చేసిన జీ ఓ ఎం ఎస్ నెంబర్ : 84/2016ను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు.అనంతరం మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.*
*మనుబోలు మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడుగా జగదీష్ బాబు ఉపాధ్యక్షులుగా సురేష్ బాబు సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా జయకర్ బాబు సంయుక్త కార్యదర్శులుగా శంకర్ గౌస్ బాషా భాష ఆర్గనైజషన్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి కోశాధికారిగా రఫీ కార్యవర్గ సభ్యులు రవీంద్ర సుబ్రహ్మణ్యం కుమార్ శర్మ శ్రీనివాసులు సాయి శ్రీనివాసులు లను ఎన్నుకొన్నారు.అనంతరం డివిజనల్ అసోసియేషన్ మరియు జె ఏసీ నాయుకులు నూతన కమిటీని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.