Advertisements

జర్నలిస్టులను వేధిస్తే చట్టపరంగా చర్యలు

సీనియర్ న్యాయవాది వేళ్ల ఉపేంద్ర నాయుడు

సోషల్ మీడియా బ్లాక్ మెయిలర్స్ పై చర్యలు తీసుకోవాలి

భారీగా తరలివచ్చి గళమెత్తిన పాత్రికేయులు

ఏకమవుదాం…హక్కులు సాధించుకుందాం..

గూడూరు డివిజన్ జేఏసీ పిలుపు

గూడూరు : వృత్తి నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధిస్తే చట్టపరంగా చర్యలు చేపడుతామని సీనియర్ న్యాయవాది వేళ్ల ఉపేంద్ర నాయుడు అన్నారు. ఆదివారం గూడూరు పట్టణ సమీపంలోని ఆషిక్ గ్రాండ్ హోటల్ లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కాలంలో గూడూరు కేంద్రంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువకావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజంలో నిజాయితీగా పనిచేస్తున్న వారికి అండగా నిలబడడం తనవంతు బాధ్యతగా భావిస్తున్నానని విలేకరుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవారందరూ విలువలను పాటిస్తూ సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అటువంటి విలేకరుల స్వేచ్ఛను హరించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం ద్వారా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ప్రముఖ సంఘ సేవకులు, న్యాయవాది కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరూలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే సంస్కృతిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా వ్యహరించి అసత్య వార్తలు ప్రచారం చేసేవారిని గ్రూపులనుండి తొలగించాలని సూచించారు. జేఏసీ ఛైర్మన్, కన్వీనర్ మీజూరు మల్లికార్జున్ రావు, గుంజాపల్లి బాబూ మోహన్ దాస్ లు మాట్లాడుతూ నకిలీ విలేకరులు, సోషల్ మీడియా బ్లాక్ మెయిలర్స్ జర్నలిస్టుల జోలికొస్తే సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు. జర్నలిస్టుల ప్రతిష్టను దిగజార్చేలా, వార్తల సేకరణను నియంత్రించేలా వ్యవహరించేవారిపై జేఏసీ లీగల్ సెల్ ద్వారా న్యాయపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. బ్లాక్ మెయిలర్స్ ఆకృత్యాలపై పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ సంఘటిత పోరాటాలతోనే జర్నలిస్టులకు వృత్తి భద్రత సాధ్రమవుతుందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, ఆన్ని శాఖల అధికారులు నకిలీ విలేకరుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించి వారి ఇగడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గూడూరు డివిజన్ జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసే చర్యలకు, అటువంటి వ్యక్తులకు కొమ్ముకాసే వారిపై సమైక్యంగా ఉద్యమిస్తిమన్నారు. అదేవిధంగా గూడూరు డివిజన్లోని ఆన్ని మండలాలలో అర్హత కలిగిన విలేకరులకు ఇంటి స్థలాల మంజూరు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సమిష్టిగా అలుపెరుగని పోరాటం చేస్తామని విలేకరుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. అలాగే ప్రతి మండలంలోనూ జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి డివిజన్ కమిటీకి అనుసంధానిస్తామన్నారు. నిజాయితీగా, థైర్యంగా వాస్తవాలను ప్రచురించే విలేకరులకు జాయింట్ యాక్షన్ కమిటీ, లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. అనంతరం గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు న్యాయవాదులను సత్కరించారు. గూడూరు డివిజన్ జర్నలిస్ట్ జేఏసీ, లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ది గూడూర్ ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, హౌసింగ్ సొసైటీ సభ్యులు, గూడూరు, చిల్లకూరు, మనుబోలు, కోట, వాకాడు, సైదాపురం, ఓజిలి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ ముడియా ప్రతినిధులు, చిరువెళ్ల సునీల్ కుమార్, షేక్. జమాలుల్లా, పంతగాని శివకుమార్, మీజూరు మల్లికార్జున రావు, బాబు మోహన్ దాస్, ఉడతా శరత్ యాదవ్, భవానీ శంకర్, నాని, శ్రీపతి రమేష్, రఘు, సుబ్బు, వెంకటేష్, సచిన్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This