నేడు గూడూరు లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జేఏసీ ఆవిర్భావ సదస్సు ….
… న్యాయ నిపుణులతో కమిటీ …
గూడూరు: డివిజన్ కేంద్రమైన గూడూరులో నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నట్లు జే ఏ సీ ప్రతినిధులు జీ.బాబు మోహన్ దాస్,మీజూరు మల్లిఖార్జున రావు,కే.సుబ్రహ్మణ్యం లు తెలిపారు.శనివారం గూడూరు లో వారు మీడియా తో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గూడూరు డివిజన్ లో జర్నలిస్ట్ లపై వేధింపులు ఎక్కువవుతున్నాయన్నారు.రాజకీయ ఒత్తిడులతో జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు,సోషల్ మీడియా లో నకిలీ విలేఖరుల ఆగడాలను ఎదుర్కొని స్వేచ్ఛ గా వృత్తి బాధ్యతలు నిర్వర్తించుకునేలా సహకారం అందించడమే లక్ష్యం గా జేఏసీ ఏర్పాటు కు శ్రీకారం చూడుతున్నట్లు తెలిపారు.అదే విధంగా జర్నలిస్ట్ లను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్ట పరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకునేలా ప్రముఖ న్యాయ నిపుణులతో లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఆదివారం ఉదయం 10గంటలకు గూడూరు జాతీయ రహదారి సమీపంలోని ఆషిక్ గ్రాండ్ లో నిర్వహించనున్న సదస్సు ను డివిజన్ లోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దానం సురేంద్ర,నానీ,జమాల్,శరత్ యాదవ్,లక్ష్మణ్,నిరంజన్ తదితరులు పిలుపునిచ్చారు.