బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ బాభారతీయ జనతా యువమోర్చా గూడూరు ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది*
భారతీయ జనతా యువమోర్చా గూడూరు ఆధ్వర్యంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా స్థానిక గూడూరు రెండో పట్నంలోని విద్యాలయ కళాశాలలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో 527 మంది వీర సైనికులు అమరులై దేశం కోసం త్యాగం చేశారని అలాంటి వారిని స్మరించుకోవడం మన బాధ్యతని ఆయన అన్నారు మరియు కార్గిల్ యుద్ధం విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిందని ఆయన అన్నారు , మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ కళాశాల విద్యార్థి ప్రముఖ్ మన్నూరు మల్లికార్జున మాట్లాడుతూ దేశం కోసం కుటుంబాలను వదులుకొని దేశ సరిహద్దుల్లో మన దేశ రక్షణ కోసం నిరంతరం పోరాటం చేసే సైనికులను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని ఆయన అన్నారు కార్గిల్ విజయ్ దివస్ మరియు కార్గిల్ యుద్ధం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని మన భారతదేశం కోసం వీరోచితంగా పోరాడిన సైనికుల గురించి తెలుసుకోవాలని ఆయన తెలిపారు, మరియు కార్గిల్ యుద్ధం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్, బిజెపి యువ నాయకులు డాక్టర్ మహేష్ గారు, కిరణ్ ,మహేష్ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు