తిరుపతి జిల్లా గూడూరు… గూడూరు శాసనసభ్యులు పాశిo సునీల్ కుమార్ ఆదేశముల మేరకు అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం లో ఉన్న సమస్యలను పరిష్కరించుటకై ఆర్డిఓ , మున్సిపల్ కమిషనర్, తాహసిల్దార్, ఎం.పీ.డీ.వో మరియు ఇతర అధికారులు పరిశీలించార ఆదిశేషారెడ్డి స్టేడియం కి వచ్చి స్టేడియం లో ఉన్నటువంటి అన్ని రంగాల క్రీడాకారులు మరియు వాకర్స్ తో కలిసి స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఆర్డీవో యం. కిరణ్ కుమార్ మాట్లాడుతూ MLA పాశిం. సునీల్ కుమార్ స్టీడియంలోని ప్రతి సమస్యని పరిష్కరించమని తెలపడం తో వారి ఆదేశము ల మేరకు వెంటనే చేపట్టవలసిన పనులను త్వరగా చేయమని అధికారులను ఆదేశించడం జరిగిందని , అదేవిధంగా ఎలాంటి ప్రైవేటు కార్యక్రమాలకు స్టేడియం ఇవ్వనని చెప్పడం జరిగింది. స్టేడియం లో నూతన జిమ్ ఏర్పాటు, ప్రహరీ గోడ మరమ్మత్తులు గ్యాలరీ నిర్మాణం, క్రీడాకారులకు శాశ్వత నీటి పరిష్కారం చేయమని వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్స్ తయారు చేయమని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఎలా ఉంది వాటర్ ఎక్కడ ఆగుతుంది అనే వివరాలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించే దిశగా చేయమని వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ సహకారంతో నిధులు సమకూర్చి మిగతా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. స్టేడియం లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించినటువంటి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి ఆర్ డి ఓ యం. కిరణ్ కుమార్ కి క్రీడాకారులు కృతఙ్ఞతలు తెలిపారు . అదేవిధంగా స్టేడియం కి వచ్చి ప్రతి సమస్యను దగ్గరుండి చూచి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గ మాట్లాడి వారి సలహా మేరకు అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పినందుకు క్రీడాకారులు ఎంతో ఆనందంతో ఆర్డీవో గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, రజిని, విజయ్, లవకుమార్, దీపక్, మస్తాన్,పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, మునీఫ్, సాయి, సుమన్ రెడ్డి, హరి, సేటు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది.