గూడూరు పట్టణంలో దారుణం
హెడ్ కానిస్టేబుల్ తల పగలగొట్టిన బెంగాల్ వాసి
అక్కడికక్కడే కుప్పకూలిన హెడ్ కానిస్టేబుల్ దాసు, పరిస్థితి విషమం
నిందితుడు లల్తూ కలిండి పోలీసు యూనిఫామ్ చూస్తే ఉన్మాదిలా మారే విచిత్ర నేర ప్రవర్తన కలిగి ఉన్నాడు
గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్లో గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాసు, మరో కానిస్టేబుల్ టీ తాగేందుకు బైకు ఆ దిగి నడిచి దుకాణంలోపలికి వస్తుండగా
వెనక వైపు నుండి హఠాత్తుగా వచ్చిన
లల్తూ కలిండి అనే పశ్చిమ బెంగాల్ కు చెందిన 24 ఏళ్ల ఉన్మాది హెడ్ కానిస్టేబుల్ దాసును కర్రతో తలవెనక వైపు కొట్టడంతో తలకు తీవ్ర ఘాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు,ఇది చూసి వెంటనే స్పందించిన పక్కనే ఉన్న కానిస్టేబుల్ స్థానికులు నిందితుడిని పట్టుకొని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు, పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టగా నిందితుడు లల్తూ కలిండి పోలీస్ యూనిఫాం చూస్తే సైకో లా మారిపోతాడని తెలిసి పోలీసులు అవాకయ్యారు… కానిస్టేబుల్ పై జరిగిన దాడి ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమరా రికార్డులో నమోదయింది….