తిరుపతి జిల్లా గూడూరు పట్టణం.
గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు .వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఏంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నాం అన్నారు.ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయి. వాటి విలువ రూ.35,576 కోట్లు పైనే. ఇళ్ల పట్టాల పేరుతో 10 వేల ఎకరాలు, ఇసుక దందాలో రూ.9,750 కోట్ల
దోచుకున్నారన్నారు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో: 512ను రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారు. ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములను కొట్టేయాలని పన్నాగం పన్నారని అన్నారుగుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఇక్కడా తెస్తాం. తాము భూమి యాజమానులని కబ్జాదారులే నిరూపించుకోవాలి. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు. అందుకు ముందే స్థలం కొని తిరిగి
ప్రభుత్వానికి అధిక రేటుకు అమ్మిశారన్నారు
తక్కువ ధరకు రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతల భాగోతాల గురించి సాక్షాధారాలతో సహా శ్వేతపత్రంలో పొందుపరచడం జరిగిందిని ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. వీరి దగ్గర నుంచి ప్రతీ రూపాయి వసూలు చేసి ప్రజా ఖజానాకు జమకడుతాం అన్నారు
రేణుగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారు. దస్పల్లా భూములను కొట్టేసి ఇళ్లు కట్టారన్నారుచిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో రూ.101 కోట్లల ఆస్తి కాజేసేందుకు యత్నించారన్నారు
వీటిపై విచారణ చేపట్టాం. 13,800 ఎకరాల ఆవ భూములను వైసీపీ నేతలకు ధారాదత్తం చేశారు. తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారనిఅధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారని వాటిలో
భవనాలు కట్టుకున్నారన్నారు.రుషికొండలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి ప్రజా ధనాన్ని వృధా చేశారు. భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం రెండేసి ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారు. మొత్తం రూ.3 వందల కోట్ల విలువైన భూమిని కేటాయించుకున్నారన్నారు
కొండలను సైతం అనకొండల్లా మింగేసి గుండులు కొట్టేశారు. ఇసుకాసురల అవతారాలెత్తి ఇసుకను మింగేశారు. వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని విమర్శలు కురిపించారు.గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జేపి వెంచర్స్ చెల్లించాల్సిన మొత్తం నుంచి రూ.800 కోట్లు మినహాయించారు. మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టకోవచ్చు ని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు తాతపూడి ఇశ్రాయేలు కుమార్, MD అబ్దుల్ రహీమ్, పిల్లెల శ్రీనివాసులు, ఏసుపాక పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.