గూడూరు పట్టణం:- నియోజకవర్గ పరిధిలోని ASI,పోలీస్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్,మహిళా పోలీస్ సిబ్బంది వారు పట్టణంలోని MLA క్యాంప్ కార్యాలయం నందు శాసన సభ్యులు, పాశిం సునీల్ కుమార్ కలసి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారు శాసన సభ్యులు తో ఉద్యోగం రీత్యా ఏదైనా పని మీద తిరుపతి కి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుండి తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు వారితో మాట్లాడుతూ గతంలో కూడా నెల్లూరు జిల్లాలో కలిపేందుకు నియోజకవర్గ ప్రజలు అందరితో కలసి పోరాటం చేసామన్నారు.అలాగే నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర లో భాగంగా నియోజకవర్గంలో పర్యటించినవుడు అధికారంలోకి రాగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చున్నారని,
అలాగే చంద్రబాబు నాయుడు ఎలెక్షన్ ప్రచారంలో పర్యటించినపుడు కూడా వారికి తెలుపున్నామని వారు పరిగణలోకి తీసుకుని చేస్తామని హామీ ఇచ్చున్నారని, ఈ నెలలో జరిగే అసెంబ్లీ సెషన్ లలో కూడా ఈ విషయం పై అసెంబ్లీ లో మాట్లాడి మన నియోజకవర్గం ని తిరిగి నెల్లూరు జిల్లా లోకి తీసుకు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.