అధికారుల నిర్లక్ష్యమే ఫుడ్ పాయిజన్
పేద పిల్లలపై శ్రద్ధ చూపనిపక్షంలో ఉద్యమమే
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
సీపీఐ నాయకుల డిమాండ్నా
యుడుపేట గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆదివారం రాత్రి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులు, వైద్యులతో చర్చించారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా
స్థానిక విలేకరులతో
మాట్లాడారు. ఇటీవల కాలంలో వసతిగృహాలలో ఫుల్ పాయిజన్ సమస్య తరచూ పత్రికలలో చూస్తున్నామన్నారు. డక్కిలిలో ఓ విద్యార్థి మృత్యువాత పడిందన్నారు. ఆహారం, నీరు కలుషితం కావడంతోనే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుఃటున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలలో మెరుగైన వసతులు, నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. గత ప్రభుత్వం నెలల తరబడి మెస్ బిల్లులు, నిలిపివేసిందన్నారు. కనీసం నూతనంగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్పందించాలన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల అస్వస్థతకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సీవీఆర్. కుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కే. నారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, మున్సిపల్ యూనియన్ నాయకులు యాకోబు తదితరులు పాల్గొన్నారు.