Advertisements

ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలు

-పేదలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి.

– భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.

– పంట నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.

-ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్ పై సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించాలి.

-సీపీఎం, కాంగ్రెస్ తో కలిసి ప్రజా పోరాటాలు22న జిల్లా సమితి సమావేశాన్ని విజయవంతం చేయాలి.

సీపీఐ జిల్లాకార్యదర్శి

పి. మురళి వెల్లడి

తిరుపతి జిల్లా  గూడూరు : ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి అన్నారు. ఆదివారం గూడూరులోని లయోలా జూనియర్ కళాశాలలో సీపీఐ సమితి సమావేశం ఆ పార్టీ పట్టణాధ్యక్షులు షేక్ కాలేషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ 3 వేల నుండి నాలుగువేల రూపాయల వరకూ వసూలు చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారన్నారు. 32 రోజులు గడిచినా ఇసుక ఉచితంగా అందించిన దాఖలాలు లేవన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగంతోపాటు 36 అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను తక్షణమే ఆపివేయాలన్నారు. అలాగే గత మిఛౌంగ్ తుపానులో సూళ్లూరుపేట నుండి గూడూరు వరకూ నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నిరుద్యోగ భృతి రూ. మూడువేల పంపిణీతో సమస్య పరిష్కారానికి నోచుకోదన్నారు. గూడూరుకు దగ్గరలో ఉన్న శ్రీసిటీలో అనేక కంపెనీలున్నా స్థానికులకు అవకాశం కల్పించలేదన్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చొరవచూపి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22, 23 తేదీలలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా సమితి సమావేశానికి పార్టీ సభ్యులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో అభ్యదయ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్, రైతు సంఘం జిల్లా నాయకులుఋ సీవీఆర్. కుమార్, సీపీఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కే. నారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, యస్థాని భాయ్, యాకోబు, పెంచలయ్య, ఆటో యూనియన్ నాయకులు భాస్కర్, కృష్ణ, శేషయ్య పురపాలక సంఘం నాయకులు యాకోబు, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు రాజా, చిన్న, రత్నయ్య, మెడికల్ వర్కర్స్ నాయకులు అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This