నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్రమంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఓ ఆనంద్, సందర్శించారు. ముందుగా… స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహంలో… సోమశిల ఆఫ్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులు తదితర ముఖ్య విషయాలపై వారు సుదీర్ఘగంగా చర్చించారు. సోమశిల జలాశయంలోని అఫ్రాన్. రక్షణ గోడ, నిర్మాణ పనులను వారు పరిశీలించారు. జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సోమశిల జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు. అనంతరం సోమశిల నుంచి బయల్దేరి స్థానిక సోమేశ్వరాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సోమేశ్వరాలయ ప్రాంతాన్ని పరిశీలించారు. పునః నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.