కరపపత్రాల ఆవిష్కరణలో బహుజన నాయకులు
గూడూరు :
కోట మండలం బహుజన
ఐక్యవేదిక ఆధ్వర్యంలో జులై 17 న
కోట షాది మంజిల్ లో జరుగనున్న
బహుజన ఐక్యత సభను జయప్రదం
చేయాలని కోరుతూ బుధవారం గూడూరులోని ప్రైవేట్ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో బహుజన
ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలో
కరపత్రాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వేగూరు విజయ్ అంబేద్కర్ మాట్లాడుతూ కారంచేడు మారణ
హోమం జరిగి ఈ నెల 17 కు 39 ఏళ్ళు పూర్తి చేసుకుంటుుందనన్నారు. అయినప్పటికీ ఇంకనూ దేశ వ్యాప్తంగాఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు
జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ దాడులను బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో
ఖండిస్తున్నామని తెలిపారు. బహుజన నాయకులు దాసరి సుందరం, రంగనాథ్ లు మాట్లాడుతూ భారత దేశంలో బహుజనులపై దాడులు జరగడం ఆగలేదన్నారు. ఇలాాంటి దాడులను తీవ్రంగా ఖండిించాలన్నారు. అలాగే 17న జరగనున్న
బహుజన ఐక్యత సభను జయప్రదం
చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక నాయకులు, వేగూరు విజయ్ అంబేద్కర్, రవి రాఘవేంద్ర, మాకాని వెంకటేశ్వర్లు, దాసరి సుందరం, మీజూరు మాధవ్, బి.రంగనాథ్, దేశయ్య, పోలయ్య, పాల్గొన్నారు.