Advertisements

గూడూరులో విద్యా సంస్థల బంద్ సక్సెస్

కేంద్ర ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. శశి కుమార్ ధ్వజం

డీఆర్ డబ్ల్యూ మహిళా కళాళాల వద్ద నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

2.సీఎస్ఎం స్కూల్ విద్యార్దులను ఇళ్లకు పంపిస్తున్న దృశ్యం

గూడూరు : ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త కేజీ నుండి పీజీ విద్యా సంస్థల బంద్ గూడూరులో గురువారం సూపర్ సక్సెస్ అయింది. పట్టణంలో ప్రయివేటు కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. శశి కుమార్ మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వ చర్యలతో దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ పరీక్షలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విద్యా విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల నిర్వహణలో అవినీతి చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు.
ఇటీవల నెట్, నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలన్నారు. ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్భందాలు యూనివర్సిటీలో ప్రజాస్వామ్య అణిచివేత చర్యలు ఆపాలన్నారు.
దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలన్నారు.
నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఆయా డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీను, సుజిత్, పవన్, మనోజ్, కిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This