Advertisements

దేశ వ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలి

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. శశి కుమార్

గూడూరు : దేశ వ్యాప్తంగా గురువారం నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలనిఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ. శశి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం గూడూరు సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాతీయస్థాయి పరీక్షలను నిర్వహించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలు, భాద్యతారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారన్నారు. నీట్ పరీక్షా లీకేజ్ తెరవెనుక కుంభకోణం, నీట్ – పిజి పరీక్షను 12గంటల మందు వాయిదా వేయడం, యూజిసి నెట్ పరీక్ష రద్దు చేయడం వంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. నీట్ స్కామ్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహిచంచి దోషులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా విద్యార్ధి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారన్నారు. ఉన్నత విద్య మాత్రమే కాకుండా పాఠశాల విద్య పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. బీజేపీ పాలనలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో కోత విధించడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గించారన్నారు. 2018-19, 2021-22 మధ్య దేశంలో 61885 పాఠశాలలు మూసివేశారన్నారు. దేశంలో విద్య, ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా జూలై 4వ తేదీన దేశ వ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకూ విద్యాసంస్థల బంద్ కు ఐక్య విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయన్నారు ఈ బంద్ లో అన్ని విద్యా సంస్థలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలన్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు.
ఇటీవల నెట్, నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్నారు.పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలన్నారు. ముంబై ఐఐటి నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై అక్రమ కేసులు, నిర్భందాలు యూనివర్సిటీలో ప్రజాస్వామ్య అణిచివేత చర్యలు ఆపాలన్నారు.
దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేతను ఆపాలన్నారు.
నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఆయా డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This