ఎన్నికల సందర్భంగా పింఛన్ల పెంపుదల హామీని నెరవేర్చిన తెలుగుదేశం పార్టీ*
*ఇచ్చిన మాట నిలబెట్టుకొన్న సి.ఎం. చంద్రబాబు నాయుడు*
*నేటి నుంచి పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 7000 రూ!! ఇంటింటికి పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన చంద్రబాబు*
*గూడూరు రెండవ పట్టణం 27, 28, 29 వార్డులలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్*
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తన హామీని నిలబెట్టుకుంటూ గెలిచిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచి ,ఏప్రిల్ నుండి 1000 రూపాయలు చొప్పున అరియర్స్ కలుపుకొని 7వేల రూపాయలు ఈరోజు వృద్ధులకు , వితంతువులకు , వికలాంగులకు, ఒంటరి మహిళలకు తదితరులకు పింఛను ఇంటి వద్దకే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు 2వ పట్టణం 27,28, 29 వార్డులలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ మరియు 15వ యూనిట్ ఇన్ ఛార్జ్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ మరియు ఇతర టీడీపీ నాయకులు పాల్గొని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఇశ్రాయేల్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు సామాజిక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారని, 2004లో 2000 రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని మరలా ఇప్పుడు 2024 లో 3వేలును 4 వేలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబునాయుడు గారిదేనని , పేద ప్రజల సంక్షేమానికి మరియు రాష్ట్ర అభివృద్ధికి నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఈ పింఛన్ల పెంపుదలను నేటి నుండే అమలుచేసి ఒకే నెలలో 7వేల రూపాయలు ప్రతి ఒక్కరికి అందేటట్లు చేసి చరిత్ర సృష్టించారని, ఇది ఒక చరిత్రని, పేద ప్రజలకు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పింఛన్ ఇంతవరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అందించలేదని ఆ ఘనత నారా చంద్రబాబునాయుడు గారిదేనని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. పింఛన్ అందుకున్న లబ్ధిదారులందరూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందజేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 16 మరియు 19 సచివాలయాల సిబ్బంది, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు, పట్టణ తెలుగు యువత నాయకులు యదనపర్తి మధురెడ్డి , పట్టణ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ వేల్పుల రమేష్ కుమార్, టీడీపీ నాయకులు 27వ వార్డు నుండి నూనె వాసు యాదవ్, అన్నంగి సుధాకర్ యాదవ్, 28వ వార్డు నుండి పోబాక లక్ష్మి , మోరా మురళి, కోవూరు మురళి , షేక్ ఆరీఫ్, గద్దె హనుమంతు , 29వ వార్డు నుండి షేక్ షంషుద్దీన్ , షేక్ ముజాహిద్దీన్, ఈరిబోయిన జయ చంద్రయ్య, పోలూరు సుధాకర్,వాసు, స్థానిక బిజెపి నాయకులు నువ్వూరు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.