సేవే లక్ష్యం..
నేటితో 17 వ వారం..
నెల్లూరు: ఎం ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం వారం అన్నదానం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఆదివారం 50 మందికి నిరుపేద నిరాశ్రయులకు భోజనము మంచినీరు మజ్జిగ పొట్లాలను అందిస్తూ వస్తున్నారు నేటితో 17 వ వారం ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మొహమ్మద్ సర్తాజుద్దీన్, మొహమ్మద్ అమృద్దీన్ లు మాట్లాడుతూ మా ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవే లక్ష్యంగా నిరుపేద నిరాశ్రయులకు అండగా కొన్ని సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అందులో భాగంగానే గత 16 వారాల నుండి నెల్లూరు నగరంలో రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి బారా షాహిద్ దర్గా వద్ద ఉన్నటువంటి నిరుపేద నిరాశ్రయులను గుర్తించి ప్రతి ఆదివారం 50 మందికి భోజనం అందిస్తున్నామని నేటితో ఇది 17 వ వారము అని ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఇంతే కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో మా సేవలు అందిస్తామని అన్నారు మమ్ములను ఇప్పటి వరకు ఆదరిస్తూ ఆశీర్వాదాలు అందిస్తున్న పెద్దలకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.