టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టోర్నీ ఆద్యంతం సమిష్టి కృష్టితో భారత జట్టు విజయాలు సాధించిందన్నారు. కృషి, పట్టుదలతో మరో గొప్పగెలుపు సొంతంచేసుకున్నారని ప్రశంసించారు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియా టీం ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు ఈ విజయం గొప్ప ఊరటినిస్తుందన్నారు. భారతజట్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. జట్టును విజయవంతంగా నడిపించడంలో రోహిత్ చక్కటి నాయకత్వాన్ని ప్రదర్శించాడని కొనియాడారు. రానున్న రోజుల్లో టీం ఇండియా మరిన్ని ఛాంపియన్‌షిప్‌లు సాధిస్తుందని ఆకాంక్షించారు.