బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం
- రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి
- గూడూరు :
- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఉపేక్షించేది లేదని గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల
మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా , వాహనాలు నడిపిన , ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా నడపడం ప్రజలకు అసౌకర్యం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం గూడూరు రూరల్ పరిధిలోని పంబ లేరు బ్రిడ్జి సమీపంలో ఉన్న వైన్ షాప్ పరిసరాలను స్థానికుల సాయంతో శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్. ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గోన్నారు.