టీ20 క్రికెట్ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్ టోర్నీలో 160 సిక్స్‌లు బాదిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.*
ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) రికార్డును అధిగమించింది. 157 సిక్స్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆర్‌సీబీని సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనక్కి నెట్టింది.ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 14 సిక్స్‌లు బాదిన సన్‌రైజర్స్ ఓవరాల్‌గా 160 సిక్స్‌ల మార్క్‌ను అందుకుంది. అభిషేక్ శర్మ 6 సిక్స్‌లు బాదగా.. రాహుల్ త్రిపాఠి రెండు, నితీష్ కుమార్ రెడ్డి మూడు, హెన్రీచ్ క్లాసెన్ రెండు, అబ్దుల్ సమద్ ఓ సిక్సర్ కొట్టారు.ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్(160) తర్వాత ఆర్‌సీబీ(157), సీఎస్‌కే(145-ఐపీఎల్ 2018), సర్రే టీమ్(144- టీ20 బ్లాస్ట్ 2023), కేకేఆర్(143-కేకేఆర్(ఐపీఎల్ 2019) జట్లు వరుసగా కొనసాగుతున్నాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. తాజా సీజన్‌లో అతను 41 సిక్స్‌లు బాదాడు. హెన్రీచ్ క్లాసెన్ 33 సిక్స్‌లు కొట్టగా.. డేవిడ్ వార్నర్(ఐపీఎల్ 2016), ట్రావిస్ హెడ్ 31 సిక్స్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన జట్టుగానూ సన్‌రైజర్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లో మొత్తం 6 సార్లు 200 ప్లస్ రన్స్ చేసిన సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్(2023), కేకేఆర్, ఆర్‌సీబీ సరసన నిలిచింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. అథర్వ టైడ్(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), రిలీ రోసౌ(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) తృటిలో అర్థ శతకాలు చేజార్చుకున్నారు.
చివర్లో జితేశ్ శర్మ(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టీ నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, విజయ్‌కాంత్ వియాస్కంత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 ) సత్తా చాటారు. రాహుల్ త్రిపాఠి(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), నితీష్ కుమార్ రెడ్డి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు.పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు