RDO. కిరణ్ కుమార్
* గూడూరు లో స్వీప్( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం*
*⬜గూడూరు సంగం థియేటర్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు బైక్ రాలీ*
* ర్యాలీ లో పాల్గున్న రిటర్నింగ్ అధికారి & రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్ కుమార్, డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి*
*గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవ హారం*
*⬜మానవ హారంలో పాల్గున్న వేలాదిమంది అన్నీ శాఖల, అధికారులు, సిబ్బంది..*
*విలువైన ఓటు వేసేందుకు ముందుకు రండి*
*నిర్లిప్తత వీడండి.. ఓటేసేందుకు ముందుకు రండి*
*⬜ఓటర్లకు రిటర్నింగ్ అధికారి & ఆర్డివో కిరణ్ కుమార్ డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి లు పిలుపు*
*కళాశా లలతో పాటు విద్యాసంస్థల్లో స్వీప్ కార్యక్రమాలు*
*ఓటర్లలో అవగాహన కోసం కళాశాల విద్యార్థుల వీధినాటక ప్రదర్శన*
*⬜‘స్వీప్’ కింద చేపట్టిన సమాచార ప్రదాన కార్యక్రమాలు సత్ఫలితాలు*
* ‘ఓటు రాజకీయ పార్టీలకు సంబంధిం చినదనే భావన నుంచి బయటకురండి:ఆర్డివో,డిఎస్పీ సూచన*
*ఓటు వజ్రాయుధం*
*⬜ప్రతి నియోజకవర్గంలోనూ వినూత్నంగా ఓటరు జాగృతి కార్యక్రమాలు*
*ఓటు వినియోగం నైతిక బాధ్యత….*
ఓటు రాజకీయ పార్టీలకు సంబంధిం చినదనే భావన నుంచి బయటకురండి. ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్న త్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమని గుర్తించండి. నిర్లిప్తతను వీడండి. విలువైన ఓటు వేసేందుకు ముందుకు రండి.’’అని ఓటర్లకు రిటర్నింగ్ అధికారి & ఆర్డివో కిరణ్ కుమార్, డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి లు పిలుపునిచ్చారు.*
*గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద శనివారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం రిటర్నింగ్ అధికారి & ఆర్డివో కిరణ్ కుమార్, డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున పాల్గున్నారు.ముందుగా గూడూరు సంగం ధియేటర్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం టవర్ క్లాక్ వద్ద విద్యార్థులు స్విఫ్ పై సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు వేసి అలరించారు.*
*గూడూరు డివిజన్ లో 85 శాతం ఓటింగ్ లక్ష్యం:ఆర్డివో కిరణ్ కుమార్*
*గత ఎన్నికల్లో గూడూరు డివిజన్ లో పరిధిలో సగటు 66 శాతం ఓటింగ్ నమోదైందని, దీన్ని 85 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రిటర్నింగ్ అధికారి &ఆర్డివో కిరణ్ కుమార్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగ స్వామ్యం అవసరమన్నారు. ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటు నమో దుకు వీలు కల్పించే ఫాం-6లను స్వీకరించి, పరిష్కరిస్తామని ఆర్డివో తెలిపారు.*
*ఓటర్లలో అవగాహన కోసం కళాశాల విద్యార్థుల వీధినాటక ప్రదర్శన*
*దేశవ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కల్పనతోపాటు వారు క్రమం తప్పకుండా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) అనీ తెలిపారు. వివిధ కార్యాలయాల సహకారంతో ‘స్వీప్’ కింద చేపట్టిన సమాచార ప్రదాన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు.*
*ఓటు వజ్రాయుధం*
*ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావన నుంచి బయటపడి.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమనే విషయాన్ని గుర్తించాలని రిటర్నింగ్ అధికారి &ఆర్డివో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.*
*ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి.. దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలతో పాటు విద్యా సంస్థల్లో స్వీప్ కార్యక్రమాలునిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ వినూత్నంగా ఓటరు జాగృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రలోభాలు లేని వాతావరణంలో ఎథికల్ ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతందని పేర్కొన్నారు.*
*ఓటు వినియోగం నైతిక బాధ్యత:డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి.*
*డి ఎస్పీ సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓటు చాలా అమూల్యమైనదని.. ఎంతో మంది త్యాగాలు, ఎన్నో విప్లవాలు, పోరాటాల ఫలితంగా అత్యున్నత ప్రజాస్వామ్యం మనకు లభించిందన్నారు. దీన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా గత ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని.. అందువల్ల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు.*
*మే 13న నిర్వహించే పోలింగ్లో అందరూ ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో, మున్సిపాలిటీ కమిషనర్, మండల తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు, రెవిన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గున్నారు.*