
గూడూరు నియోజకవర్గం(TDP)
గూడూరు పట్టణం:- పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఉమ్మడి BJP -TDP -JSP పార్టీల నాయకులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారుపాశిం సునీల్ కుమార్
మాజీ శాసన సభ్యులు
నియోజకవర్గం అభ్యర్థి
మాట్లాడుతూ…
వైసీపీ పై ఉన్న వ్యతిరేకత తో ప్రజల కోసం కూటమి ఏర్పాటు చేసాం అన్నారు.దళితులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం వైసీపీ వాళ్లు కూటమి కి ఇంకా పొత్తులు కుదర్లేదు అని చెప్పడం దుర్మార్గం, సిగ్గుచేటుఅన్నారు.రాష్ట్రంలో ఈ మూడు పార్టీల కలయికతో వైసీపీ కి వెన్నులో వణుకు పుడుతుందన్నారు చిన్నాన్నను చంపింది ఎవరో ప్రజలకు బాగా తెలుసుఅన్నారు.కూటమి విజన్ తో రాష్ట్ర అభివృద్ధి చేస్తాము .కానీ యువత కి మెగా డిఎస్సి పేరుతో మోసం చేసింది జగన్ ప్రభుత్వంఅన్నారు. వాలంటీర్లను అపుచేసింది టీడీపీ అని ప్రచారం చేయడం దారుణం అన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక 4000 పింఛన్ ఇస్తాంఅన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాంఅన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్లకు ఇంకా ఇవ్వాల్సిన అన్ని పథకాలు అందిస్తామన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తాంకూటమి కి వస్తున్న ఆదరణ చూడలేకే వైసీపీ మాపై వాలంటీర్ల విషయంలో బురద జల్లే ప్రయత్నం చేయటం సిగ్గు చేటు…..గూడూరు నియోజకవర్గం లో అక్రమ వ్యాపారాలు చేసింది చేస్తుండేది వైసీపీ నాయకులే అక్రమ వ్యాపారాలు చేసేది మీరు మమ్మల్ని రాక్షసులు అనడం దొంగే దొంగ దొంగ అన్నట్లుంది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ప్రచారంలో బాణాసంచా కాలుస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తుండేది వైసీపీ నేకావున RO గారు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలిఅన్ని సర్వేలు ఎవరు గెలుస్తారో చెపుతున్న కూడా మీకు ఇంకా గర్వం తగ్గలేదు, రౌడీఇజం తగ్గలేదు అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య,దువ్వూరు రవీంద్ర రెడ్డి,నియోజకవర్గ BJP అధ్యక్షులు పురుషోత్తమ రెడ్డి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, పట్టణ BJP – JSP అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, ఇంద్రవర్ధన్ తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు.
