Advertisements

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీప్రాంతంలో 51ఎర్రచందనం దుంగలను స్వాధీనం

అత్తివరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూబింగ్ చేపట్టారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా

టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారి వడ్ఢకు వెళుతున్నా సమయం లో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరిని పట్టికోగలిగారు.  అతనిని అన్నమయ్య జిలా రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ ముక్తియార్ ఎలియాస్  బాషా (27)గా గుర్తించారు. అతన్ని విచారించగా సమీపంలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచిన డంప్ చూపించాడు. అక్కడ 46 ఎర్రచందనం దుంగలతో పాటు. 5ఎర్రచందనం  గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాయుడుపేట కు చెందిన ఆంబోతుల రంగయ్య, ఆంబోతుల శివ కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Leave a Comment

You May Like This