కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన అమరాపు సతీష్ బాబు
గూడూరు :
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా అమరాపు సతీష్ బాబును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఛైర్మన్ సాకే శంకర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సతీష్ బాబు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పదవిని పొందేందుకు సహకరించిన ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డికి, ఏపీ ఎస్సీ సెల్ ఛైర్మన్ సాకే శంకర్,
ఉపాధ్యక్షులు కొరివి విజయ్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ ఏఐసీసీ నాయకుడు కొప్పోలు రాజు, స్థానిక నాయకులు వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.