Advertisements

రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన సయ్యద్ గఫూర్

వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ గఫూర్

గూడూరు పట్టణానికి చెందిన సయ్యద్ గఫూర్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. గతంలో గూడూరు నియోజకవర్గ మైనిరిటీ సెల్ అధ్యక్షుడుగా గఫూర్ సేవలందించారు. ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు అనుచరడిగా ఉంటూ మైనారిటీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. దీంతో ఎమ్మెల్యే వర ప్రసాద్ షాదీ మంజిల్ అధ్యక్షుడిగా, తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించారు. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషల సహకారంతో గఫూర్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీంతో గూడూరు పట్టణ మైనారిటీ సోదరులు గఫూర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ అబ్దుల్ గఫూర్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తామన్నారు. మైనారిటీలకు ప్రభుత్వం అందించే పథకాలన్నీ వంద శాతం అందేలా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎంపీకయ్యేందుకు సహకరించిన అగ్ర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment

You May Like This