పులికాట్ సముద్రపు ముఖద్వారం అభివృద్ధి పనులకు 248 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, త్వరలో పసులు జరుగుతాయని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి అన్నారు. శనివారం ఎంపీ గురుమూర్తి తో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. గూడూరు వైకాపా ఇన్చార్జ్ మురళీధర్, వాకాదు సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, అధికారులు వాకాడు మండలం సవాబ్ వేట బంగాళాఖాతం
సముద్ర ముఖద్వారం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ఈ సముద్రపు ముఖద్వారం వలన మత్స్యకారులకు జీవ నోపాది మెరుగు పరుచు కుంటారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రపు ముఖ ద్వారం పూ డికతీత పనులకు 248 కోట్ల రూపా యలు మొదటి విడత గా మంజూరు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పులికాట్ ముఖద్వారం పూడిక తీత సంబంధించిన పసులను నివేదికలు ఇప్ప టికే ప్రభుత్వానికి
చేరాయని, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభు త్వానికి అందజేయడం జరుగు తుంద న్నారు. వాకాడు సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి పులికాట్ ముఖ ద్వారం పూడిక తీత ద్వారా ఈ ప్రాంతంలో నివసిస్తున్న అనేక మంది మత్స్యకారులు వారి జీవనశైలి పెంపొందించు కొని అభివృద్ధి చెందుతా రన్నారు. ఇది ఎన్నో సంవత్సరాలగా ప్రతి పాదనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మో హన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మత్స్యకారుల కొరకు సుమారు 248 కోట్ల రూపాయలు మంజూరు
చేసి త్వరలో జరగబోయే ఈ పూడిక పనుల ద్వారా అనేక ఫిషరీస్ స్టోరేజ్ కూడా నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని యంపిని, కలెక్టర్ ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు వైకాపా ఇన్చార్జ్ మేరీగా మురళీధర్, గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్, తాసిల్దార్ నరసింహారావు, ఉప సర్పంచ్ వెంకటరత్నం, సర్పంచక్ష్మి, వాకాదు వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు అజిత్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు