చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో రామ్ చరణ్ జన్మదితోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు, జనసేన నాయకులు నయీమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే గ్రామంలోని 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జన సైనికుడు నయీమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన విజయం సాధిస్తాయన్నారు. రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా ప్రతి రోజూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, వీర మహిళ చామండి రాధమ్మ,నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరవ రాజేష్,వెంకటగిరి జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు రామారావు, అనిల్ కుమార్, వెంకటగిరి జనసేన పట్టణ ఉపాధ్యక్షులు, చిరంజీవి యువత అధ్యక్షులు, కోన రవిశంకర్, గూడూరు నియోజవర్గ పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు ప్రసన్నకుమార్యువత వైస్ ప్రెసిడెంట్ విజయ్,
గూడూరు పవన్ కళ్యాణ్ యువత టౌన్ అధ్యక్షుడు పవన్ కుమార్,జాయింట్ సెక్రెటరీ హరి కుమార్, సాయి ధరంతేజ్ ఆభిమాన సంఘం అధ్యక్షుడు సునీల్, రమేష్, పెంచలయ్య, చిన్న, కృష్ణ, హసన్, శివ, హరి తదితరులు పాల్గొన్నారు.