Advertisements

యునైటెడ్ ఫోరం సభ్యులను కలిసిన మాజీ ఎమ్మెల్యే

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందిస్తున్న ఫోరం సభ్యులు

గూడూరు :
గూడూరు పెద్ద మశీదువీధిలో ఉన్న ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీస్ యునైటెడ్ ఫోరం కార్యాలయానికి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ విచ్చేశారు. ఫోరం సభ్యులను కలసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఫోరం సభ్యులను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ గెలవాలన్నారు. పార్టీలోకి రావాలని, కలసి పనిచేద్దామని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం సభ్యులు మిజీ ఎమ్మెల్యేకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరంజాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్, రాష్ట్ర ఎస్టీ విభాగం సభ్యులు మాకాని వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా ఎస్టీ అధ్యక్షులు గెర్రి చెంచయ్య, రాష్ట్ర యువత ఎస్సీ అధ్యక్షులు మణి, జిల్లా యువత అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This