-డి సి ఎల్ ఓ రవి రాజశేఖర్
తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం లభించే జనరిక్ మందులను ప్రజలు కొనుగోలు చేసుకోవాలని డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి రవి రాజశేఖర్ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని గూడూరు నెం 24 పిఎసిఎస్ కార్యాలయ ఆవరణంలో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాన్ని డీసీఎల్ఓ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిఎల్ఓ మాట్లాడుతూ దేశంలో ప్రతి పేదవాడికి ఎలాంటి ఆర్ధిక భారం కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య ప్రయోజనం కలిగేలా ప్రధాన మంత్రి జన ఔషధీ కేంద్రాలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారన్నారు.గూడూరు మండలంలోని ప్రజలకు ఉపయోగపడేలా గూడూరు నెం 24 పి ఏ సి ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు చైర్మన్ అట్ల శ్రీనివాసులు రెడ్డి,సి ఈ ఓ యనమల. నారాయణల కృషి చేశారన్నారు. ప్రైవేట్ మందుల షాపు నిర్వాహకులు వారి లాభాల కోసం జనరిక్ మందులతో రోగాలు నయం కావని పనిగట్టుకుని అబద్ధపు మాటలు చెప్తున్నారని అవన్నీ వాస్తవాలు కావన్నారు. ప్రవేట్ షాపుల్లో అమ్మే మందులతో పోల్చుకుంటే జనరిక్ మందులు సుమారు 40 నుండి 50 శాతం తక్కువకే లభిస్తాయన్నారు.అనంతరం డి సి ఎల్ ఓ చేతుల మీదుగా తొలిసారిగా జనరిక్ మందులను విక్రయించారు. వినియగదారులు జనరిక్ మందుల కొనుగోలుపై ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది కొనుగోలు చేసేలా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గూడూరు నెం 24 పి ఏ సి ఎస్ చైర్మన్ అట్ల శ్రీనివాసులు రెడ్డి, గూడూరు ఎంపిపి బూదూరు గురవయ్య,గూడూరు నెం పి ఏ సి ఎస్ సిఈఓ యనమల నారాయణ,గూడూరు నెం 24 పీ ఏ సి ఎస్ డైరెక్టర్లు మనుబోలు కృష్ణయ్య,రవీంద్ర రాజు,మాజీ ఏ ఎం సి చైర్మన్ బాబురెడ్డి,మాజీ డైరెక్టర్ లు జనార్ధన్ రెడ్డి,మంగలపూరు సర్పంచ్ వసంత రెడ్డి,వైసీపీ నాయుకులు, మిటాత్మకూరు ఉప సర్పంచ్ రమణా రెడ్డి,రమేష్ యాదవ్,చంద్రమోహన్ యాదవ్,దయాకర్ రెడ్డి,సిబ్బంది నారాయణ రెడ్డి,రాజా తదితరులు పాల్గొన్నారు.