గూడూరు మండల తహసీల్దార్ కరుణకుమార్ వెల్లడి
తెల్లరాయి అక్రమ త్రవ్వకాలపై ఉక్కు పాదం మోపుతాం అని తిరుపతి జిల్లా గూడూరు మండల తహశీల్దార్ కరుణకుమార్ అన్నారు… గత కొన్ని నెలలుగా రెవెన్యూ అసైన్ మెంట్ భూముల్లో తెల్లరాయిని భారీ యంత్రాలతో వెలికితీస్తూ అక్రమార్కులు కోట్లు ఆర్జిస్తున్నారని, గూడూరు మండలం తెల్లరాయి త్రవ్వకాలకు అడ్డాగా మారిందని స్థానిక ప్రజల , ప్రతి పక్ష పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కరుణకుమార్ ను జీ న్యూస్ వివరణ కోరగా స్పందిస్తూ తెల్లరాయి అక్రమ త్రవ్వకాలు జరుగుతున్న సమాచారాన్ని స్థానిక రెవెన్యూ అధికారులకు వెంటనే సమాచారం అందించాలని , మైనింగ్ , పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, త్రవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలను , వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు….గూడూరు మండలంలో రెవెన్యూ అధికారులను అలర్ట్ చేశామని , టీమ్ లుగా ఏర్పడి తెల్లరాయి అక్రమ త్రవ్వకాలపై దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతామని గూడూరు మండల తహసీల్దార్ కరుణకుమార్ తెలిపారు.