తిరుపతి జిల్లా గూడూరు మండలం: చెన్నూరు మేజర్ పంచాయతీ నుండి YCP కి చెందిన పలువురు ముఖ్య నాయకులు వారి పదవులకు రాజీనామా చేశారు త్వరలో TDP లో చేరుతారని. మాజీ శాసన సభ్యులు & నియోజకవర్గ అభ్యర్థి తెలిపిన-పాశిం సునీల్ కుమార్ ఓ ప్రకటన లో తెల్పారు .
మేజర్ పంచాయతీ అయిన చెన్నూరు నుండి YCP ముఖ్య నాయకులు గూడూరు AMC – ఛైర్మెన్ అల్లూరు కరుణాకర్ రెడ్డి,YCP తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి,పార్లమెంట్ సేవాదల్ సెక్రటరీ కందలి మురళి రెడ్డి వారి పదవులకు రాజీనామ చేశారు.ముఖ్య నాయకులు 24 సొసైటీ మాజీ ప్రెసిడెంట్ ముప్పాల సుధాకర్ రెడ్డి,మాజీ నీటి సంఘ అధ్యక్షులు, ఉగ్గుముడి వెంకటకృష్ణ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుముడి రవీంద్ర రెడ్డి,యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి(YSR)తదితరులను కలసి త్వరలో పార్టీ లోకి రావాలని ఆహ్వానించామని అన్నారు.గత ఎలెక్షన్ లలో ఇక్కడ మెజారిటీ తగ్గిందని, ఇపుడు వీరి రాకతో ఎక్కువ మెజారిటీ వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు నాయకులు మట్టం మురళి,తోడేటి శివకుమార్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.