తిరుపతి జిల్లా మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభించి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా. మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా ఈరోజు నిర్వహించారు.ఈ మహోత్సవం లో పాత్రికేయులు, తిరుపతి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన కమిటీ సమావేశం లో మణి రమేష్ గారిని సంయుక్త కార్యదర్శి గా ఏక గ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. జర్నలిజం లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది ఎన్నో సమస్యలపై పోరాడి పరిష్కారం చూపిస్తూ .ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తిని ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి గా ఎన్నుకోవడంతో పాత్రికేయులు,ప్రజా ప్రతినిధులు స్నేహితులు అభినందనలు తెలిపారు . ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ కు నా యొక్క పూర్తి సహకారం తో నిరంతర కృషి తో మరింత ముందుకి విజయవంతం గా నడిపిస్తానని మీడియా మిత్రులకు ఎలావేళ అందుబాటులో వుంటూ ఎంత వరకు అయినా పోరాడడానికి సిద్ధంగా వున్నానని హామీ ఇచ్చారు.