Advertisements

వాలంటీర్ల సేవ లు వెలకట్టలేనిది.

ఎమ్మెల్సీ అభ్యర్థి మేరుగా మురళీధర్.

గూడూరు మున్సిపల్ పరిధిలోని గ్రామ,వార్డు వాలంటీర్ల సేవలకు. సేవా మిత్ర. సేవారత్న .సేవావజ్ర పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం. గూడూరు సి ఆర్ రెడ్డి కళ్యాణ మండపం లో. బుధవారం సాయంత్రం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ. వైయస్ జగన్మోహన్ రెడ్డి .మానస పుత్రిక ఈ వాలంటరీ వ్యవస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు సారదులుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉంటూ సంక్షేమ పథకాలను అందించే దిశగా ఈ వాలంటరీ వ్యవస్థ దోహదపడుతుందన్నారు. కరోనా కాలంలో వాలంటీర్లు .ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక. ఎందరుకు ప్రాణాలను పోసిన ఘనత ఈ వ్యవస్థకు దక్కిందన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. సచివాలయాలలో సిబ్బంది ఎంబీఏ. ఎంసీఏ .ఇంజనీరింగ్. పీజీ తదితర క్వాలిఫికేషన్లతో సచివాలయాలలో ఉద్యోగాలు చేస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వాలలో మండల పరిషత్తు వ్యవస్థనుండి .నేడు గ్రామ సచివాలయ వ్యవస్థకు తీసుకురావడం జరిగిందన్నారు.

తద్వారా సామాన్య మానవులకు సైతం సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులు చేసే అభ్యర్థులు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందడం జరిగిందన్నారు.వారికి భవిష్యత్తులో మంచి జరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో విలీనమైన హోంగార్డు శాఖను కూడా దేహదారుద్య పరీక్షలు. రాత ప్రశ్న ఆధారంగానే నేడు రిక్రూట్మెంట్ జరిగే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది అన్నారు.. హిమాలయ వంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొని సొంత పార్టీని స్థాపించి ఏకంగా భారతదేశంలోనే 150 మంది ఎమ్మెల్యేలతో అధికారాన్ని చేపట్టిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కింది అన్నారు. ఆయన ఆలోచన ముందు తరాలకు భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఉంటుందన్నారు .కార్పొరేట్ కళాశాలలో దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలను మార్చడం జరిగిందన్నారు తద్వారా నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా మంచి యూనిఫాం .షూలు కూడా అందించడం జరిగిందన్నారు. నవరత్నాలు కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలను రూపొందించి .ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరి విధంగా ప్రణాళికలను రూపొందించి పేదవాడు సాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు . సచివాలయాలలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు .సేవా మిత్రా .సేవ రత్నం .సేవ వజ్ర ప్రశంస పత్రాలు ద్వారా నగదును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఈ సి సభ్యులు గోపాల్ రెడ్డి. .రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ దేవసేనమ్మ. వైఎస్ఆర్సిపి నాయకులు వాయుగుండ్ల నాగరాజు. బొమ్మిడి శ్రీనివాసులు. రాజేష్ కుమార్. నాసిన నాగులు. గిరిబాబు .తాలూరు శ్రీనివాసులు .బాబు .కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This