Advertisements

పాత్రికేయులు భవానీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

నిరాశ్రయుల వసతిగృహంలో ఘనంగా సీనియర్

పాత్రికేయులు భవానీ ప్రసాద్ జన్మదిన వేడుకలు


విస్తృతంగా సేవా కార్యక్రమాలు : పీఎంజీడబ్ల్యూఏ


నిరాశ్రయులకు భోజనం, పండ్లు పంపిణీ


గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి భవాని శంకర్ జన్మదిన వేడుకలు గూడూరులోని గమళ్లపాలెం మై ఫ్రెండ్స్ అసోసియేషన్, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అద్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో నిరాశ్రయులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యుల సమస్యలతోపాటు సుఖ సంతోషాలలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో భవానీ ప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిరాశ్రయులకు భోజనం, పండ్లు పంపిణీ చేశామన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యుల జన్మదిన వేడుకలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భవానీ పదేళ్లుగా విలేకరి వృత్తిలో కొనసాగుతూ సమస్యాత్మక కథనాలను ప్రచురిస్తూ ప్రజల మన్ననలు పొందారన్నారు. భవానీ భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. భవానీ ప్రసాద్ మాట్లాడుతూ వెల్ఫేర్ అసోసియేషన్ తన కుటుంబంలా భావిస్తానన్నారు. నిరాశ్రయుల నడుమ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మనోహర్ రెడ్డి, బాలకృష్ణ, సురేష్, కిషోర్, శ్రీనివాసులు, నిరంజన్, లక్ష్మణ్, ఎంఎఫ్ఏ అధ్యక్షులు రాహుల్, కలీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This