Advertisements

పేటేటి కుటుంబంతో అనుబంధం మరువలేనిది..

  • మాజీ ఎమ్మెల్ల్యే పాశిం సునీల్ కుమార్..

గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎన్నారై పేటేటి సుజనేష్ సారథ్యంలో, సారంగం సుధీర్, పామూరి దుర్గారావు ఆధ్వర్యంలో పేటేటి బ్రదర్స్ శ్రీనివాసులు, ప్రకాష్ నాయుడు నాయకత్వంలో గూడూరు పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుండి వందలాదిమంది యువకులు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ యమ్మెల్ల్యే పాశం సునీల్ కుమార్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్ల్యే పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పేటేటి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసారు. గతంలో పేటేటి సత్యం నాయుడు బ్రతికి ఉండేటప్పుడు తాము ఎక్కువగా వారి ఇంటివద్దనే ఉంటూ రాజకీయాలగురించి చర్చించేవారమన్నారు. ఆయన మరణానంతరం ఆ కుటుంబ సభ్యులకు తమకు మధ్య కొంత దూరం ఏర్పడినప్పటికీ పేటేటి కుటుంబం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే మద్దతు పలుకుతుందన్నారు. వేరే దేశంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీమీద, తన నాయకత్వంమీద నమ్మకంతో వందలాదిమంది యువత, మహిళలను పార్టీలో చేరేలా ప్రోత్సాహించిన పేటేటి సుజనేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా పార్టీలో చేరేవారిని సమీకరించి, నాయకత్వం వహించిన పేటేటి బ్రదర్స్ శ్రీనివాసులు, ప్రకాష్ నాయుడిని శాలువా కప్పి సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు, నిరుద్యోగులకు ఎంత మేలు జరుగుతుందో వివరించారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిలో భాగంగా గూడూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువత, మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, బిల్లు చెంచురామయ్య, నరశింహులు, వాటంబేటి శివకుమార్, ఇస్రాయేల్, రవీంద్రరెడ్డి, ఔరంగ్ భాషా, మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

[democracy id="1"]

You May Like This