
తిరుపతి జిల్లా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించడంతోటీడీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు పట్టణ కమిటీ తరఫున పెద్దలు నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.అదేవిధంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు పేపళ్ల అమరయ్య నాయుడు సునీల్ కుమార్ ని శాలువా కప్పి సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు .ఈ సందర్భంగా పేపళ్ల అమరయ్య నాయుడు… మాట్లాడుతూ 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గూడూరు నియోజకవర్గంలో నుంచి అహర్నిశలు కష్టపడి అత్యధిక ఓట్ల మెజార్టీతో సునీల్ అన్నని గెలిపించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి సునీల్ అన్నని ఒక కానుకగా అందజేస్తామని.. మరొక్కసారి గూడూరు పట్టణ కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.