Advertisements

జర్నలిస్టులపై దాడి హేయం. దాడికి పాల్పడిన అల్లరిమూకలను అరెస్టు చేయాలి

గూడూరు : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సదస్సులో విలేకరులపై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్.జమాలుల్లా అన్నారు. ఆదివారం స్థానిక టవర్ క్లాక్ సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్. జమాలుల్లా, ఉడతా శరత్ యాదవ్ లు మాట్లాడుతూ సాక్షాత్తూ సీఎం సభలో విలేకరుల క్యాబిన్ వద్ద చొచ్చుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడం దారుణమన్నారు. సమాజ హితం కోసం పనిచేసే విలేకరులపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, ఏఐటీయూసీ నాయకులు జీ. శశి కుమార్, ఎంబేటి చంద్రయ్యలు మాట్లాడుతూ పాత్రికేయులపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రజా సంఘాలుగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలి, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి, జర్నలిస్టులకు న్యాయంచేయాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బాబూమోహన్ దాస్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్, అసోసియేషన్ గౌరవ సలహాదారులు మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ, పఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మడి అనిల్ కుమార్, భవానీప్రసాద్, (నాని), ఉడతా శశిధర్, ప్రసాద్, కిషోర్ నాయుడు, మంగలపూరు శ్రీనివాసులు, నిరంజన్, కృపానిధి, సీపీఐ నాయకులు శశికుమార్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This