Advertisements

గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్

గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగ విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు వసంత యోగ అకాడమీ నిర్వాహకురాలు వసంతలక్ష్మి మీడియాకు తెలిపారు . తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన వసంత యోగ అకాడమీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో గూడూరు పట్టణానికి చెందిన సంధ్యారాణి సూర్య నమస్కారాలు విభాగంలో నోబెల్ రికార్డు రికార్డు స్థాపించారని తెలిపారు . సంధ్యారాణి సూర్య నమస్కారాలు నాన్ స్టాప్ గా 108 సార్లు అతి తక్కువ సమయంలో చేయడంతో ఆమె నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించినట్లు న్యూఢిల్లీకి చెందిన ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారని తెలిపారు .యోగ మన భారతదేశ సంపద అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంధ్యారాణి మీడియాకు తెలిపారు . ఆన్లైన్లో నిర్వహించిన యోగా పోటీలలో నోబెల్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంధ్యారాణి ఆదివారం గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు యోగ అలవాటు చేసుకోవాలని అభిలాషించారు . యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటామని పేర్కొన్నారు . ప్రపంచ దేశాలు మన దేశ సంపద అయిన యోగాపై దృష్టి సారించి వారు యోగ సాధన చేస్తున్నారని తెలిపారు . సూర్య నమస్కారాలు విభాగంలో నోబెల్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు .

Leave a Comment

You May Like This