Advertisements

నందికాల లక్ష్మీ అనే మహిళకు ఒక కుట్టు మిషన్ ను బహుకరణ

తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో #28.01.2024 వ తేదిన ఆదివారం ఉదయం 10 గంటలకు గూడూరు లో బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు మన సోదరుడు అయిన శ్రీ కృష్ణా సేవా సమితి అధ్యక్షులు మరియు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్. మయూరి శ్యామ్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళకు జీవన ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గూడూరు లో అశోక్ నగర్ లోని నందికాల లక్ష్మీ అనే మహిళకు ఒక కుట్టు మిషన్ ను బహుకరించడం జరిగింది అలానే ఆయన మయూరి శ్యామ్ యాదవ్ గారి పుట్టినరోజు సంధర్భంగా ఘనంగా కేక్ ను కట్ చేసి మరియు శాల్వా తో సత్కరించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,సెక్రెటరీ G.చంద్రశేఖర్,ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు,పి.డి.కరిముల్లా,గ్రానైట్ ప్రభాకర్,ఐ.టి.ఐ ప్రభాకర్,ప్రభాకర్(రిటైర్డ్ S.I), వాచ్ షాప్ రాము,కుమార్ నాయుడు,పిల్లిల శీను,కృష్ణా రెడ్డి,వాకాటి శ్రీనివాసులు,CVR న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment