Advertisements

తిరుమలలో శ్రీ విశాఖ శారదాపీఠం చేపట్టిన సెవెన్ స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్


తిరుపతి – తేది: 28.01.2024

తిరుమలలో శ్రీ విశాఖ శారదాపీఠం చేపట్టిన సెవెన్ స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్

ఈరోజు స్థానిక తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేష్ మరియు నాయకులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో విశాఖ శారద పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదాపీఠస్వామిజీలు వాటిని ఆపాలని, హిందువులకు పవిత్రమైన ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన వైకుంఠం తిరుమల టీటీడీగా ఏర్పడి 1933 వ సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమీషనర్ను తిరుమలకు పంపడం ప్రప్రథమం కావడం బాధాకరమన్నారు. ఈ కమిషనర్ ఎందువలన వస్తున్నారంటే సనాతన ధర్మలను హిందూ సంప్రదాయాలను కాపాడుతూ భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించాల్సిన కొన్ని పీఠాలు స్వామీజీలు టీటీడీ నియమ నిబంధనలను పాటించకుండా వారికిష్టం వచ్చినట్టు ప్రభుత్వం సహాయంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన వ్యాజ్యాలు రావడం బాధాకరమన్నారు. డబ్బే ప్రధానంగా సెవెన్ స్టార్ బిల్డిoగ్స్ సెల్లార్ నుండి కట్టి ప్రయివేట్ వ్యక్తులచె వ్యాపారం చేయిస్తు విరుద్ధంగా కోట్లరూపాయలు డొనేషన్స్ వసూలు చేస్తూ సంపాదనకోసం టీటీడీ వ్యవస్థనే అక్కడి ఉద్యోగస్థులు తప్పుతోవ పట్టించి కట్టడాలు నిర్మించారు. ఈరోజు తిరుమలలో ఏపని ఏ వస్తువులు తిరుమలకు చేరాలంటే విజిలన్స్ పంచాయతీ, హెల్త్, ఇన్ని పర్మిషన్లు కావాలి సామాన్యుడికి. అయితే మరి ఈ స్వామీజీ కట్టే కట్టడాలకు సిమెంట్, ఐరన్ ఇసుక మిగతా వస్తువులు ఎలా వెళ్లాయి. ఇంతమంది కళ్లుగప్పి ఈ పీఠం వారు నిర్మించడం తప్పుకాదంటారా? వీరికి

కొంతమంది అధికారులు జరిమానా వేయించాము అని కోర్టులో వాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాం. అయితే ఎవరైనా తప్పు చేస్తే, దానికి టీటీడీ అధికారులు వేసే జరిమానా కట్టించుకొని ఏమైనా చెయ్యచ్చా. దీనికి శాసనం ఉందా? టీటీడీ తెలియజేయాలి.
టీటీడీ ధర్మకర్తలమండలి, టీటీడీ వ్యవస్థ, ప్రభుత్వం, టీటీడీ అర్చక మండలి సనాతన ధర్మాలను తిరుమల పవిత్రతను కాపాడుకోకపోతే ఇలాంటి స్వామీజీలు తిరుమలలో ఇంక ఎన్నో తప్పిదాలు చేస్తారు. ఇలాంటి స్వామీజీల వలన హిందూ వ్యవస్థకే చెడ్డ పేరు, హైందవ సిద్ధాంతాలను సనాతన ధర్మలను వీరు చేసే కార్యక్రమాలు భక్తులకు ఆదర్శంగా వుండాలి. కాని వారు చేసేది అలా అనిపించడం లేదు.తక్షణమే ఈ అక్రమ భవణాలును తొలగించి టీటీడీ వ్యవస్థని కాపాడాలని కోరుతున్నా ము.. అలజరగని పక్షంలో తిరుమలలో 2 నుండి జరిగే స్వామీజి కార్యక్రమాలకు వెళ్లే విశాఖ శారదా పీఠం స్వామీజీకి భక్తులతో కలసి నిరసన సెగలు చేస్తాము. ఈ అక్రమ కట్టడాలను హైకోర్టు నియమించిన
కమిషనర్ పర్యటనలో స్థానిక శ్రీవారి భక్తులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిపి నిష్పక్షపాతంగా విచారణ జరిపి తక్షణమే ఆ భవణాల నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటా చలపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడినాక, చందు, రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షులు కందనూరు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

You May Like This